18 July, 2026 | 12:46 AM

తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిక

18-07-2026 12:46 AM

హైదరాబాద్, జులై 17(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌కి చెందిన జగ్గారెడ్డి అనుచరుడిగా గుర్తింపు పొందిన నీరడు ఆంజనేయులు మాల మహానాడు జిల్లా అధ్యక్షులు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.తనతో పాటు సుమారు 30 మంది అనుచరులతో కలిసి టీఆర్పీలో చేరారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మన్నే రమేష్ యాదవ్, జిల్లా అధ్యక్షులు రవి నాయక్ ఆధ్వర్యంలో పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా నీరడు ఆంజనేయులు మాట్లాడుతూ బీసీ,ఎస్సీ, ఎస్టీ,మైనారిటీ వర్గాలకు రాజకీయ అధికారం సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న తీన్మార్ మల్లన్న నాయకత్వాన్ని బలపర్చేందుకే టీఆర్పీలో చేరినట్లు తెలిపారు.తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు.

సామాజిక న్యాయం సాధనకు పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు. కాగా టీఆర్పీలో చేరిన వారు సుధాకర్, ముత్యాలు,చండ్రక్, సుధాకర్, ఎండీఆజీ, నరేష్, శాంతి కుమార్, ఎండీ సమీర్, గణేష్, ఎండీ సాయిదా, తస్లీమ్ బేగం, ఎండీ షమీంల, ఎండా షకీలా, దుర్గేష్, ఎం మురళి ఉన్నారు