నిరుద్యోగులకు తోపుడు బండ్లు పంపిణీ
08-07-2026 05:35 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంతో పాటు సోన్ మండలంలోని కడ్తాల్ గ్రామంలో చదువుకొని ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శోభా సత్యనారాయణ గౌడ్ బుధవారం తోపుడు బండ్లను ఉచితంగా పంపిణీ చేశారు. జాతీయ గుడ్డు అసోసియేషన్ అభిరామ్ పియర్స్ సౌజన్యంతో 20 మంది యువకులకు తోపుడు పనులను పంపిణీ చేసి కుటుంబాలను పోషించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు ధర్మాజీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.






