20 March, 2026 | 4:12 PM

గురుకుంటలో రంజాన్ తోఫా పంపిణీ

20-03-2026 02:30 PM

 సర్పంచ్ ఎస్. రవీందర్ రెడ్డి

నవాబ్ పేట: రంజాన్ పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ తోఫా" కానుకలను గురుకుంట గ్రామంలో శుక్రవారం పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ ఎస్ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు అందించారు. 

ఈ సందర్భంగా సర్పంచ్ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ముస్లింలకు రంజాన్ పండుగ అత్యంత పవిత్రమైనదని పేర్కొన్నారు. నెల రోజుల పాటు కఠిన ఉపవాస దీక్షలు చేపట్టి, భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేసే ముస్లిం సోదరుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఈ కానుకలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పక్షాన ముస్లిం సోదరులందరికీ ఆయన ఈద్ ముబారక్' శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు సభ్యులు హరీశ్వర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి నాయకులు: రవీందర్ రెడ్డి, బోయిని నరసింహులు, సి. వెంకటయ్య, వి. వెంకటయ్య, నరేందర్, సి. వెంకటేష్, రాజు, జంగయ్య మరియు గ్రామ ప్రజలు ఉన్నారు.