నేడు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, ఆగస్టు 16 (విజయ క్రాంతి) : సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని ప్రజావాణి హాల్లో జిల్లా ఇన్చార్జ్ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారులు వారికి కేటాయించిన విధుల్లో నిమగ్నమై ఉంటారని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్డీవో, తాసిల్దార్ కార్యాలయాల్లో యధావిధిగా ప్రజావాణి దరఖాస్తులు స్వీకరణ ఉంటుందని తెలిపారు.
సమీకృత కలెక్టరేట్ కార్యాల యంలో ప్రజావాణి హాల్ నందు సోమవా రం మధ్యాహ్నం 12:30 గంటలకు తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగా రాలు, గనులు, భూగర్భ శాస్త్ర మంత్రిత్వ శాఖల మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి చేతుల మీదగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు.
అధికారులందరూ వారికి కేటాయించిన విధుల్లో నిమగ్నమై ఉన్నందున రేపు సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. ఇట్టి విషయాన్ని ప్రజలందరూ గమనించి సహకరించాలన్నారు.






