17 August, 2026 | 1:17 AM

మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ కుటుంబం కదిలింది

17-08-2026 12:35 AM
  1. ఎస్‌ఐఆర్ ఫేజ్1 విజయవంతం
  2. కార్యకర్తల సమష్టి కృషికి అభినందనలు..మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నాయకత్వానికి ప్రశంసలు
  3. పటిష్టమైన కార్యాచరణతో ముందుకు.. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

మంథని, ఆగస్టు 16(విజయక్రాంతి) మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఎస్‌ఐఆర్ ఫేజ్1 కార్యక్రమం విజయవంతంగా పూర్తికావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. పార్టీ నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు, సూపర్వైజర్లు, కాంగ్రెస్ ఇన్చార్జీలు, ఏఈఆర్‌ఓలు, ఈఆర్‌ఓలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.మంథని నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు మార్గదర్శకత్వంలో పార్టీ శ్రేణులు ప్రజలకు చేరువగా పనిచేస్తున్నాయి.

పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో శ్రీధర్బాబు నాయకత్వం కీలకంగా నిలుస్తోందని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. అదే సమయంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు పార్టీ కార్యకర్తలను సమన్వయం చేస్తూ, సంస్థాగత కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేయడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఎస్‌ఐఆర్ ఫేజ్1 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ శ్రీనుబాబు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ప్రతి బూత్ను బలోపేతం చేయడం, ప్రతి కార్యకర్తను పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం,

కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పార్టీ నాయకులు తెలిపారు.ఎస్‌ఐఆర్ ఫేజ్1 విజయవంతం కావడం వెనుక శ్రీధర్బాబు నాయకత్వం.. శ్రీను బాబు సమన్వయం.. కాంగ్రెస్ కార్యకర్తల సమష్టి కృషి ఉన్నాయని కాంగ్రెస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. రానున్న రోజుల్లో ఇదే స్ఫూర్తితో పార్టీని మరింత పటిష్టం చేస్తామని స్పష్టం చేశారు.కార్యకర్తలే కాంగ్రెస్కు బలం.. సమష్టి కృషితోనే విజయపథం అనే నినాదంతో మంథని కాంగ్రెస్ కుటుంబం మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతోంది.