17 August, 2026 | 1:29 AM

జెండాను ఎగురవేశారు.. తీయడం మరిచారు!

17-08-2026 12:33 AM

బొంతపల్లిలో కాంగ్రెస్ నాయకుల తీరు

గుమ్మడిదల, ఆగస్టు 16: గుమ్మడిదల మున్సిపాలిటీ బొంతపల్లి వార్డులో వీరభద్ర నగర్ కాలనీ జాతీయ రహదారి పక్కన ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఎగరవేసిన జాతీయ పతాకాన్ని కాంగ్రెస్ నాయకులు వదిలేయడంతో విమర్శలు తలెత్తాయి. గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి జాతీయ హైవేపై ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద పంద్రాగస్టు రోజు ఎగురవేసిన జెండా ఇంకా ఎగురుతూనే ఉంది.

ఈ విషయంపై పట్టణ ప్రజలు అగ్రం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి ప్రక్కన పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ జండాను ఎగరవేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 24 గంటలు గడిచినా ఇంకా జాతీయ జెండా దించకపోవడంపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.