5 May, 2026 | 3:22 PM

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం...

01-07-2025 03:22 PM

పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత నాదే

దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

దేవరకొండ: దేవరకొండ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం జాతీయ ఆహార భద్రత మిషన్(National Food Security Mission) ద్వారా జొన్న, కంది విత్తనాల చిరు సంచులను లబ్ధిదారులకు అధికారులతో కలిసి దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... రైతులను రాజులను చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిచేస్తుందని, రైతాంగానికి అండగా నిలబడాలన్న లక్ష్యంతోనే రుణ మాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్, ఉచిత కరెంట్, స్ప్రింక్లర్స్, డ్రిప్, సోలార్ గిరి వికాసంలో పంపుసెట్లు, సివిల్ సప్లయ్ విభాగం ద్వారా ధాన్యం కొనుగోలు ఇలా కేవలం 18 నెలల కాలంలో వ్యవసాయ రంగంపై 1 లక్ష 04 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన ప్రజా ప్రభుత్వం అని అన్నారు.అనంతరం  నివాసంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులపై సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ  నిజమైన అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, నిజమైన అర్హులకు గుర్తించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సంబంధిత అధికారులు సూచించారు.