calender_icon.png 1 July, 2025 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ లక్ష్యం : టస్మా జిల్లా అధ్యక్షుడు కోడి శ్రీనివాసులు

01-07-2025 03:26:56 PM

చండూరు,(విజయక్రాంతి): ఎ ఆసరా లేని నిరుపేదలను ఆదుకోవడమే గాంధీజీ ఫౌండేషన్ లక్ష్యమని గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు కోడి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం గాంధీజీ విద్యాసంస్థల యందు 30 మంది నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మా జీవితం ఉన్నంతవరకు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా ఉచిత నిత్యవసర సరుకుల పంపిణీతోపాటు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన అన్నారు. గాంధీజీ విద్యాసంస్థల ద్వారా తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులకు చాలా తక్కువ ఫీజుతో విద్యను అందిస్తున్నామని ఆయన అన్నారు. రెండు సంవత్సరములు వరకు ప్రతి నెల 30 మందికి నిత్యవసర సరుకుల పంపిణీ చేస్తున్నామని, అది మా గాంధీజీ ఫౌండేషన్ ఆశయమని ఆయన అన్నారు.