08-12-2025 05:21:55 PM
వేములవాడ (విజయక్రాంతి): మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న నిరంతర అన్నదాన సేవ 1691వ రోజుకు చేరింది. ఈ సందర్భంలో సోమవారం ఆలయాల వద్ద పేదలకు భోజనం వడ్డించారు. పేపర్ ప్లేట్ల వాడకం ఆరోగ్యానికి మంచిది కాదని భావించిన ఒక గుప్తదాత ప్రతిరోజూ వినియోగానికి స్టీల్ ప్లేట్లు అందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సోమవారం అన్నదాతలు పుట్టినరోజు, పెళ్లిరోజు సందర్భంగా నిమ్మశెట్టి విజయ్–శారద, కమ్మగాని సుధాకర్–మమత, కట్ట రమేష్–విజయ దంపతులు అన్నదానంలో పాల్గొన్నారు.
శాశ్వత దాతలు డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వరరావు–స్నేహాలత దంపతులతో పాటు పలువురు దాతలు కార్యక్రమానికి నిరంతరం సహకరిస్తున్నారు. పేదలకు పూట భోజనం అందించడంలో సహకరించాలనుకునే దాతలు ట్రస్టును సంప్రదించాలని నిర్వాహకులు మధు, మహేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతాప నటరాజు, రాజేందర్, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.