08-12-2025 05:25:49 PM
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పటిష్ట బందోబస్తూ ఏర్పాటు చేయాలి
ఎన్నికలలో ఇబ్బందులు కలిగించే వారిని బైండోవర్ చేయాలి
చెక్ పోస్ట్లు పకడ్బందీగా నిర్వహించాలి, మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలి
వనపర్తి జిల్లా ఎస్పీ పోలీసు అధికారులతో జోగులాంబ జోన్ -7 డిఐజి సమీక్ష
జోగులాంబ జోన్ డిఐజి ఎల్ ఎస్, చౌహన్
వనపర్తి క్రైమ్: గ్రామీణ ప్రాంతాల్లో జరిగే పంచాయతీ ఎన్నికలు సజావుగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా జరిగేలా ప్రతి ఒక్కరు పనిచేయాలని జోగులాంబ జోన్-7 డిఐజి ఎల్ ఎస్, చౌహన్ అన్నారు. మూడు విడుతలుగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సోమవారం వనపర్తి జిల్లా ఎస్పీ, ఏఆర్ అదనపు ఎస్పీ, డిఎస్పీలు, సీఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లలతో జోగులంబ జోన్ డీఐజీ కార్యాలయంలో డీఐజీ ఎల్ ఎస్, చౌహన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర డీఐజీ మాట్లాడుతూ... ప్రజలకు ప్రశాంతమైన వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికల నియమాలని కచ్చితంగా అమలు చేయాలని జిల్లా సరిహద్దుతో ఉన్న నేపథ్యంలో అక్రమ రవాణా జరగకుండా చెక్పోస్ట్ ద్వారా అడ్డుకోవాలని తెలిపారు.
శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతాల నందు ఎక్కువ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు. ఎన్నికల విధులలో సాయిద సిబ్బందిని సక్రమంగా వినియోగించుకోవాలన్నారు. ఎన్నికలలో సమస్యలను సృష్టించే వారిని బైండోవర్ చేస్తూ ఉండాలన్నారు, ప్రజలలో నమ్మకం పెంచేందుకు, ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తూ ప్రజలలో పోలీసులు పట్ల ధైర్యం నింపాలన్నారు. ఈ సమావేశంలో వనపర్తి జిల్లా ఎస్పీ, సునిత రెడ్డి, ఏఆర్ అదనపు ఎస్పీ వీరారెడ్డి, వనపర్తి డిఎస్పి, వెంకటేశ్వరరావు, డిసిఆర్బి డిఎస్పి, బాలాజీ నాయక్ వనపర్తి సిఐ, కృష్ణయ్య, కొత్తకోట సిఐ, రాంబాబు, ఆత్మకూరుసీఐ, శివకుమార్ జిల్లా పోలీసు అధికారులు సిఐలు పాల్గొన్నారు.