calender_icon.png 23 June, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టీ షర్ట్, టై, బెల్టులు పంపిణీ

23-06-2025 07:34:34 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): తెలుగు సమితి అఫ్ నేబ్రాస్కా, స్ఫూర్తి ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో సినీ సంగీత దర్శకుడు చక్రి(Film Music Director Chakri) జన్మదిన సందర్భంగా మహబూబాబాద్ మండలం రెడ్యాల ప్రభుత్వ ప్రాథమికొన్నత పాఠశాల విద్యార్థులకు ఏకరూప టీ షర్ట్స్, టై, బెల్ట్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రధానోపాధ్యాయులు పాక రాజేశ్వరి స్ఫూర్తి ఫౌండేషన్ నిర్వాహకులు ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులపై చూపించే ఔదార్యానికి కృతజ్ఞతలు తెలిపారు. మినిమమ్ వెజెస్ అడ్వైజరి బోర్డు మాజీ చైర్మన్ సామ వెంకటరెడ్డి మాట్లాడుతూ... విద్యార్థుల తల్లితండ్రులు ప్రభుత్వ పాఠశాలపై నమ్మకము ఉంచి పాఠశాలలో చేర్పించాలన్నారు.

భవిష్యత్తులో కూడా పాఠశాలకు తన వంతు సహకారం ఉంటుందన్నారు. స్ఫూర్తి ఎడ్యుకేషన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామసహాయం శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద పిల్లలకు అన్ని రకాలుగా సహకారం అందించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ప్రతి బుధ, శనివారాల్లో ప్రైవేటు పాఠశాలల్లో ప్రత్యేకంగా ధరించే విధంగా ప్రోత్సహించాలనే సదుద్దేశంతో ప్రైవేట్ పాఠశాల దీటుగా ప్రభుత్వ పాఠశాల ఉండే విధంగా ఏకరూప టీ షర్ట్స్, టై బెల్ట్ లు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో కంబాలపల్లి  కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఉప్పలయ్య, స్ఫూర్తి ఎడ్యుకేషన్ కోశాధికారి ఆకుల శ్రీకాంత్, తెలంగాణ సాంస్కృతిక కళా బృందం అధ్యక్షులు కొలిశెట్టి సత్యనారాయణ, ఉపాధ్యాయులు సరిరామ్, విజయ, రజిత, ఉమ, శివ, నవీన, ప్రత్యుష పాల్గొన్నారు.