18 June, 2026 | 7:17 PM

పాఠ్యపుస్తకాల పంపిణీ

18-06-2026 05:57 PM

విద్యలో మరింత ప్రతిభ కనపరచండి 

కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు 

పాల్వంచ, (విజయక్రాంతి): ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యలో మరింత ప్రతిభను ఘనపరచాలని 47వ డివిజన్ కార్పొరేటర్ గుర్రం వెంకటేశ్వర్లు కోరారు. గురువారం  పాత పాల్వంచ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2026 - 2027 విద్యా సంవత్సరానికి గాను.  విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. విద్యార్థులు విద్యలో మరింత ప్రతిభ కనబరచాలని ఆకాంక్షిస్తూ, వారి భవిష్యత్తు అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పద్మలత   పాఠశాల  ఉపాధ్యాయులు, విద్యార్థులు,    బరగడి అనిల్ , మేడిద రూపస్, సెనగ శ్రీను, అలీ ప్రేమ్, వాళ్ళమళ్ళ సందీప్, తదితరులు పాల్గొన్నారు...