శాంతి భద్రతల పరిరక్షణలో కమిషనర్ కీలక భూమిక
మర్యాదపూర్వకంగా సీపీని కలిసిన మునిగాల నరసయ్య
కుషాయిగూడ, జూన్ 18 (విజయక్రాంతి): శాంతి భద్రతల పరిరక్షణలో నేరాలను అదుపు చేయడంలో పోకిరిలను అరికట్టడంలో సిపి బాడుగుల సుమతి కృషి ప్రశంసనీయమని కేసీఆర్ కూరగాయల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మునిగాల నరసింహ పేర్కొన్నా రు.
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ ప్రగతి నగర్ కు చెందిన కెసిఆర్ కూరగాయల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మునగాల నరసింహ తదితరులు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతిని కలిసి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ జవహర్ నగర్ లో పోకిరిల ఆగడాలు వంటి సమస్యలపై సిపి దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే స్పందించిన సిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. పర్యావరణ పరిరక్షనే ధ్యేయంగా ప్రజలను చైతన్యవంతులను చేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు.






