మహిళలకు చెక్క భజన పలకలు పంపిణీ
09-05-2026 01:35 AM
మఠంపల్లి, మే 8: మండల కేంద్రలోనీ భగత్ సింగ్ నగర్ లో శ్రీ సీతారామచంద్ర స్వాముల భజన బృందం వారికి మఠంపల్లి సర్పంచ్ ఏసుమల్ల వీరలక్ష్మి పాపయ్య శుక్రవారం బృందం మహిళలకు యువకులకు చెక్క పలకలు దాతగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బృందం పంతులు మామిడి నాగరాజు, ఏసుమల్ల ముక్కంటి, మామిడి సామేలు, ఏసుమల్ల రాములు, పోతబత్తిని బాలకృష్ణ మామిడి మరియన్న మహిళలు యువకులు పాల్గొన్నారు.






