పెగళ్లపాడులో ఉపాధి హామీ పనులను పరిశీలన
09-05-2026 01:33 AM
ఎర్రుపాలెం మే 8(విజయ క్రాంతి): శుక్రవారం నాడు మండల పరిధిలోని పెగలపాడు గ్రామంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీల పనులను ఖమ్మం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కొండపల్లి శ్రీరామ్ పరిశీలించారు. ఉపాధి హామీ కూలీలతో స్వయంగా మాట్లాడటం జరిగింది. తదనంతరం గ్రామ సర్పంచ్ కాకర్లముడి అనిల్ ,పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మజ్జిగ ప్యాకెట్లు ను ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంపీడీవో చేతుల మీదగా కూలీలకు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి సురేందర్ , ఏపీవో నాగరాజు,ఏసి లక్ష్మయ్య ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ సగ్గుర్తి వెంకట నారాయణ,గ్రామ ఉప సర్పంచ్ గూడూరు నాగలక్ష్మి పాలకమండలి సభ్యులు, ఫీల్ అసిస్టెంట్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.






