17 August, 2026 | 4:36 PM

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

17-08-2026 03:06 PM

.. ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎంపీడీవో జ్యోత్స్న పాటిల్

వాంకిడి, (విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రతీ సోమ వారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు, వాంకిడి మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, వాంకిడి ఎంపీడీవో జ్యోత్స్న పాటిల్ అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయం సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో తహసీల్దార్ కవితతో కలిసి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా భూ సమస్యలు, పెన్షన్, ఇనుప విద్యుత్ స్తంభాలు తొలగింపు, తదితర సమస్యలపై 22 ఫిర్యాదులు అందినట్లు ఎంపీడీవో పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ సమస్యలను ప్రజావాణి ద్వారా పరిష్కరించుకునేందుకు అవకాశం ఉందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీవో, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.