31 August, 2026 | 11:42 PM

కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు

31-08-2026 10:52 PM

చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల పట్టణానికి చెందిన బీజేవైఎం నాయకుడు కంబాలపల్లి సతీష్‌కుమార్‌ యాదవ్‌ నల్గొండ జిల్లా బీజేవైఎం అధ్యక్షుడిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుగా చిట్యాల పట్టణంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సతీష్‌కుమార్‌ యాదవ్‌ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరికంటి మొగులయ్య, బీజేపీ పట్టణ అధ్యక్షుడు గుండాల నరేష్‌, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రుద్రవరం లింగస్వామి తదితరులు శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. జిల్లా స్థాయిలో బీజేవైఎంను మరింత బలోపేతం చేసి యువతను పార్టీ వైపు ఆకర్షించేలా కృషి చేయాలని వారు ఆకాంక్షించారు.