ప్రజావాణిలో రేషన్ కార్డులు, భూ సమస్యలపై దరఖాస్తులు

31-08-2026 | 10:54pm

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లిలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజావాణి నోడల్ అధికారి, ఎంపీడీవో సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ప్రజావాణికి మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు హాజరై సమస్యలపై దరఖాస్తులను అందజేశారు.రాజుపేట కాలనీకి చెందిన భూక్య నరేష్ గత సంవత్సరం ఆగస్టులో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసినప్పటికీ ఇంతవరకు రేషన్ కార్డును మంజూరు చేయలేదని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. భూ సమస్యలపై పలువురు దరఖాస్తులు అందజేశారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ భాగ్యలక్ష్మి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు