14-02-2026 12:51:44 AM
కౌంటింగ్ కేంద్రాల వద్ద 163వ సెక్షన్ అమలు
కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
మిర్యాలగూడ, ఫిబ్రవరి 13: మిర్యాలగూడ మండలం అవంతిపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో మిర్యాలగూడ, నందికొండ, హాలియా మున్సిపాలి టీల ఓట్ల లెక్కింపు పటిష్ట బందోబస్తు మధ్య పకడ్బందీగా నిర్వహించారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలోని 48 వార్డుల కౌంటింగ్ కొరకు 49 టేబుల్ లను రెండు హాళ్లలో ఏర్పాటు చేసి మొదటిగా 241 పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. అనంతరం ఆయా వార్డుల్లోని అన్ని బూతులను కలిపి ఓట్లను ఒకచోట గొప్పగా పోసి 25 చొప్పున కట్టలు కట్టి తర్వాత గుర్తుల వారిగా వేరు చేశారు.
అనంతరం కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభించిన కౌంటింగ్ అధికారులు కౌంటింగ్ సూపర్వైజర్ల పర్యవేక్షణలో ఎన్నికల కమిషన్ మార్గ నిర్దేశాల మేరకు ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా సజావుగా ఓట్ల లెక్కింపు పెట్టిన ప్రారంభించారు. ఉదయం 11:30 గంటలకు వార్డుల వారీగా ఫలితాలు ప్రకటించిన అధికారులు మధ్యాహ్నం ఒంటిగంట వరకు పూర్తి ఫలితాలను అధికారికంగా వెల్లడించారు. విజేతలకు సబ్ కలెక్టర్ నారాయణ న్ అమిత్, ఎన్నికల సహాయ, అధికారి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్నికల్లో గెలిచినట్లు విజేతలకు ధృవీకరణపత్రాలు అందజేశారు.
కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో ఏర్పాటుచేసిన నందికొండ, హాలియా, మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ బూరుగు చంద్రశేఖర్ పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాటను సమీక్షించిన అనంతరం ఆయన కౌంటింగ్ సిబ్బంది సూపర్వైజర్లు అధికారులకు పలు సూచనలు చేసి అలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా అభ్యర్థులకు ఏజెంట్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించాలన్నారు. పటిష్టమైన నిఘా ఏర్పాట్ల మధ్య మిర్యాలగూడ డి.ఎస్.పి రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు కౌంటింగ్ కు అవసరమైన చర్యలను చేపట్టారు.