calender_icon.png 14 February, 2026 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాన ఓట్లు.. టాస్‌తో గెలుపు

14-02-2026 12:52:02 AM

యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో కాంగ్రెస్ విజయం

సూర్యాపేట, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి):  యాదాద్రి జిల్లా చౌటుప్పల్ ఏడో వార్డ్ విజయాన్ని టాస్ ద్వారా నిర్ణయించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ ఏడో వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థిని కానుగు యాదమ్మకు మొదటిసారి లెక్కింపులో 603 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థిని కాసర్ల మంజులకు 601 ఓట్లు వచ్చాయి. మంజుల కోరిక మేరకు రీకౌంటింగ్ పెట్టగా ఇద్దరికీ 601 ఓట్లు చొప్పున వచ్చాయి. దీంతో టాస్ తప్పనిసరి అయింది. అధికారులు టాస్ వేయడంతో కాంగ్రెస్ అభ్యర్థిని మంజుల గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు.