calender_icon.png 31 July, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరుపేద మహిళలకు ఆర్థిక సహాయం అందజేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

30-07-2025 07:40:38 PM

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): అనారోగ్య కారణాలు, ఇల్లు లేకుండా, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నిరుపేద ఒంటరి మహిళలకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(District Collector Sandeep Kumar Jha) ఆర్థిక సహాయం అందజేసి భరోసానిచ్చారు. ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామానికి చెందిన తస్లీమా అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లలను పోషించడం ఇబ్బందిగా ఉందని, ఇల్లంతకుంట మండలం చిన్నలింగాపూర్ గ్రామానికి చెందిన అనంతలక్ష్మి అనే మహిళ కంటి సమస్యలతో బాధపడుతూ, పిల్లల పోషణ, తదితర ఇబ్బందులు ఉన్నాయని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను కలిసి తమకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మానవతా హృదయంతో స్పందించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ముస్తాబాద్ మండలం ఆవునూర్ గ్రామానికి చెందిన తస్లీమాకు 20 వేల రూపాయలు, ఇల్లంతకుంట మండలం చిన్నలింగాపూర్ గ్రామానికి చెందిన అనంతలక్ష్మి కి పది వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అందజేశారు. ఈ సందర్భంగా వారు జిల్లా కలెక్టర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.