calender_icon.png 3 February, 2026 | 7:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటవీ సంరక్షణ.. వన్యప్రాణుల పరిరక్షణలో ఉద్యోగుల సేవలు కీలకం

03-02-2026 05:31:21 PM

* నాగర్ కర్నూల్ జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్ చంద్ర

* జూనియర్ అటవీ అధికారుల సంఘం డైరీ ఆవిష్కరణ

అచ్చంపేట: అటవీ సంరక్షణ.. వన్యప్రాణుల పరిరక్షణలో ఉద్యోగుల సేవలు ఎంతో కీలకమైనవనీ నాగర్ కర్నూల్ జిల్లా అటవీశాఖ అధికారి రేవంత్ చంద్ర పేర్కొన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచంపేట అటవీ శాఖ కార్యాలయంలో జూనియర్ అటవీ అధికారుల సంఘం నూతన డైరీని ఆయన సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ శాఖలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అటవీ అధికారుల సేవలు అటవీ సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణలో ఎంతో కీలకమని పేర్కొన్నారు.

విధి నిర్వహణలో క్రమశిక్షణ, నిబద్ధత, ప్రజలతో స్నేహపూర్వక వ్యవహారం అవసరమని సూచించారు. జూనియర్ అటవీ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ.. అటవీ శాఖ అధికారుల మధ్య సమన్వయం పెంచేందుకు, విధి నిర్వహణలో ఉపయోగపడే సమాచారం అందించేందుకు ఈ డైరీని రూపొందించామని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. కార్యక్రమంలో  ఎఫ్ డీవో, ఫ్లాయింగ్ స్క్వాడ్ రాంమోహన్,అటవీ శాఖ అధికారులు ఈశ్వర్, సుబ్బుర్, మాక్దుమ్, అటవీ అసోసియేషన్ సభ్యులు ముజీబ్ ఘోరి, తేజశ్రీ, రాంబాబు, వల్య నాయక్ హన్మంతు, జూనియర్ అటవీ అధికారులు పాల్గొన్నారు.