9 April, 2026 | 9:07 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

ముగిసిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు

02-10-2025 12:53 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),అక్టోబర్ 1: గత మూడు రోజులుగా సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం గ్రామంలో మండల, గ్రామ యూత్ కాంగ్రెస్‌ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు బుధవారం ముగిశాయి. హోరాహోరీగా సాగిన కబడ్డీ పోటీలలో మొదటి బహుమతి నూతనకల్, 2వ బహుమతి కోదాడ, 3వ బహుమతి హుజూర్నగర్, 4వ బహుమతి జాజిరెడ్డిగూడెం, 5వ బహుమతిని మోతె జట్టు కైవసం చేసుకున్నాయి.

గెలుపొందిన జట్లకు బహుమతుల ప్రధాత, డీసీసీ ఉపాధ్యక్షులు దరూరి యోగానంద చార్యుల ఆదేశానుసారం ఆయా జట్లకు నగదుతో పాటు షీల్ లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నర్సింగ శ్రీనివాస్ గౌడ్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శిగ నసీర్ గౌడ్,కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు నర్సింగ కృష్ణమూర్తి, వల్లాల ఖాజా, బింగి కృష్ణమూర్తి, మామిడి అనిల్, రాజ్ కుమార్, జెర్రిపోతుల రాంబాబు, విజయ్, సందీప్ పాల్గొన్నారు.