02-10-2025 12:55:35 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), అక్టోబర్ 1: స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో పీఓ,ఏపీఓలదే కీలక పాత్రని,ఎన్నికల నిర్వహణపై ఇస్తున్న శిక్షణ సద్వినియోగం చేసుకోవాలని తహశీల్దార్ బాషపాక శ్రీకాంత్, ఎంపీడీఓ గోపీలు అన్నారు. బుధవారం మండలంలోని రామన్నగూడెం గ్రామ రైతువేదికలో పీఓ,ఏపీఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలింగ్ నిర్వహణ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు ఎదుర య్యేందుకు అవకాశం ఉంది. వాటిని ఎలా పరిష్కరించాలనే దానిపై స్పష్టమైన అవగాహన కల్పించేందుకు శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని, ఇట్టి శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ రామకృష్ణ, శిక్షకులు వి సైదులు, పి మల్లయ్య, జూనియర్ అసిస్టెంట్ శిల్పిక, పంచాయతీ కార్యదర్శులు సుధాకర్, రాజశేఖర్, నారాయణమూర్తి, రమేష్, పీఓలు, ఏపీవోలు పాల్గొన్నారు.