02-10-2025 12:50:55 AM
కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్
సూర్యాపేట అక్టోబర్ 1 (విజయక్రాంతి) : రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో జడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కలెక్టర్ విసి హాల్ లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించినారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్, అభ్యర్థులు ఎన్నికలలో ఉపయోగించే వాహనాలు, మైక్ లు, భోజనాలు, ప్లెక్సీ, లేబర్ చార్జీలు, కరపత్రాలు, పోస్టర్లు,ఎల్ డి స్క్రీన్ లు తదితర అంశాలకు చెందిన వస్తువుల ధరల వివరాలు రాజకీయ పార్టీ నాయకులకు వివరించారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలలో కొత్తగా ఎటువంటి పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, గ్రౌండింగ్ వంటివి ఉండవన్నారు.
సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారాన్ని, అసత్య ప్రచారాన్ని ప్రసారం చేసినచో తగు చర్యలు తీసుకోబడతాయన్నారు. గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతల విషయంలో అందరు సహకరించి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేలా చూడాలని తెలిపారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలలో రాజకీయ పార్టీల మీటింగులు, ర్యాలీల కొరకు అనుమతులు తీసుకోవాలని, ర్యాలీలను ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి బృందాలు వీడియో రికార్డులు చేస్తారని, అభ్యర్ధులు తమ ఖర్చులను ఎన్నికల కమిషన్ కు సమర్పించాలని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కే సీతారామారావు, జడ్పీ సీఈవో వివి అప్పారావు, జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి, కాంగ్రెస్ పార్టీ నుండి రాజేశ్వరరావు,బి ఆర్ ఎస్ నుండి బడుగుల లింగయ్య యాదవ్, నిమ్మల శ్రీనివాస్ గౌడ్,బిజెపి నుండి ఎం డి హబీద్, సిపిఐఎం తరఫున కోట గోపి, , బిఎస్పీ నుండి స్టాలిన్, సిపి ఐ నుండి బెజవాడ వెంకటేశ్వర్లు, బూర వెంకటేశ్వర్లు,జడ్పీ డిప్యూటీ సి ఈ ఓ శిరీష, డి ఎల్ పి ఓ నారాయణ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.