14-11-2025 10:30:37 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో జిల్లా టేబుల్ టెన్నీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 15 న ఉదయం 10 గంటల నుంచి జిల్లా స్థాయి టేబుల్ టెన్నీస్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు టేబుల్ టెన్నీస్ అసోసియేషన్ అధ్యక్షులు కోడం అజయ్, జనరల్ సెక్రటరీ బొల్లి సత్యనారాయణ లు శుక్రవారం తెలిపారు. పోటీలకు వచ్చే క్రీడాకారులు ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి , పాస్పోర్ట్ సైజ్ ఫోటో వెంట తీసుకొచ్చుకోవాలని, మిగతా వివరాలకు సెల్ నంబర్ 9396540067 ను సంప్రదించాలని కోరారు.