calender_icon.png 14 November, 2025 | 11:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రీ–ప్రైమరీ తరగతి గది ప్రారంభం

14-11-2025 10:27:47 PM

నంగునూరు: మండలం పరిధిలోని నర్మెట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ-ప్రైమరీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన తరగతి గదిని శుక్రవారం మండల విద్యాధికారి తగిరెడ్డి దేశి రెడ్డి ప్రారంబించారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడంలో ఈ ప్రీ-ప్రైమరీ తరగతి గదులు కీలక పాత్ర పోషిస్తాయని కొనియాడారు. పాఠశాలను చక్కగా తీర్చిదిద్దిన ప్రధానోపాధ్యాయులు ఎనగందుల మనిష్ కుమార్ ఉపాధ్యాయ బృందాన్ని ఆయన అభినందించారు. బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలకు బడిగంట (ఎలక్ట్రిక్ బెల్)ను గ్రామానికి చెందిన గట్టు కనకయ్య బహుకరించారు.పాఠశాల అభివృద్ధిలో సమాజం, దాతల భాగస్వామ్యంనీ ప్రధానోపాధ్యాయులు మనిష్ కుమార్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్ పర్సన్ లింగంపల్లి రజిత కుమార్, ఉపాధ్యాయ బృందం తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.