19 August, 2026 | 6:59 AM

జిల్లా స్థాయి యువోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

15-03-2025 12:41 AM

కరీంనగర్, మార్చి 14 (విజయ క్రాంతి):  కరీంనగర్ నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 19 న  నిర్వహించనున్న జిల్లాస్థాయి యువ ఉత్సవ్ పోస్టర్ ను శుక్రవారం జిల్లా కలెక్టర్   పమేలా సత్పతి  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ జిల్లాస్థాయి యువ ఉత్సవ్ లో కవిత్వం, చిత్రలేఖనం, డిక్లమేషన్, మొబైల్ ఫోటోగ్రఫీ, సైన్స్ మేళా ఇండివిజువల్, గ్రూప్స్, కల్చరల్ డాన్స్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.