03-02-2026 07:51:45 PM
ఫోటో రైట్ రికార్డులను పరిశీలిస్తున్న దృశ్యం
జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్
మిర్యాలగూడ,(విజయక్రాంతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న ఉద్యోగ సిబ్బంది నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని నల్గొండ జిల్లా వైద్య అధికారి పుట్ల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండలం పరిధిలోని ఆలగడప పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించి, అవసరమైన సూచనలు చేశారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యులు సిబ్బంది అందుబాటులో ఉండి వారికి అవసరం అయిన ఆరోగ్య సేవలు అందించడం తో పాటు సేవా పథకాలు గురించి అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఆయన వెంట డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ దీప, అలగడప వైద్యాధికారి డాక్టర్ షేక్ మోయీద్, డి పీ వో విష్ణు, సీ హెచ్ ఓ మోతిలాల్, ప్రభాకర్, వాసుదేవ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.