08-12-2025 12:25:57 AM
ములుగు,డిసెంబర్7(విజయక్రాంతి):ములుగు జిల్లా పోలీసు అధికారి కేకాన్ సుధీర్ రామనాధ్ ఈ రోజు మేడారం గ్రా మంలో నిర్మాణం జరుగుతున్న దేవాలయ పునర్నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ముందుగా ఎస్పి సమ్మక్క సారల మ్మల దర్శనం అనంతరం పునర్నిర్మాణ పనుల పురోగతిని వివరంగా పరిశీలించారు మేడారం జాతర సమయంలో భారీగా వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవాలయ ఆవరణలో భద్రతా ఏర్పాట్లు, ప్రవేశ నిష్క్రమణ మార్గాలను పోలీసింగ్ అవసరాలు మరియు అత్యవసర సేవల సమన్వ యం వంటి అంశాలపై సంబంధిత అధికారులతో చర్చించారు.
పనుల నాణ్యత నిర్మాణ వేగం భద్రతా ప్రమాణాలు అన్నింటిని అడిగిన ఎస్పి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు పూర్తిగా సిద్ధంగా ఉండాలని సూచించారు. మేడారం జాతర సమయంలో పోలీసులు చేపట్టాల్సిన ప్రత్యేక చర్యలకు అనుగుణంగా సూచనలు అందించారు.