08-12-2025 12:24:28 AM
మహబూబాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రం లోని ధరణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో కురవి మండల కేంద్రంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. గుండె వైద్యనిపుణులు డాక్టర్ అశోక్ కుమార్, మెద డు, నరాల వైద్యనిపుణులు డాక్టర్ సాయిహరీష్, గైనకాలజిస్ట్ డాక్టర్ అరుణ, రుమటా లజిస్ట్ డాక్టర్ రమణమూర్తి రోగులను ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించడంతోపాటు, ఉచితంగా మందులను అందజేశారు.
ఈ సంద ర్భంగా ధరణి ఆస్పత్రి ప్రతినిధి ప్రసాద్ మా ట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను సామాన్యులకు అందుబాటు ధరల్లో అందించాలనే సంకల్పంతో ధరణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సేవలను అందిస్తుందని తెలిపారు. నూతన యాజమాన్యం అనే కమంది సూపర్ స్పెషాలిస్ట్ వైద్యులను, సేవలను అందుబాటులోకి తెచ్చిందని, ఇకమీ దట క్లిష్టమైన వైద్యసేవల కోసం మహానగరాలకు పరుగులు పెట్టాల్సిన అవసరం లేద ని, మన మహబూబాబాద్ లోని ధరణి అన్ని రకాల వైద్యసేవలను అందించడానికి సిద్ధంగా ఉందని ప్రసాద్ తెలిపారు.