calender_icon.png 5 December, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోడ్‌ను ఉల్లంఘించిన అధికారులు

05-12-2025 12:37:23 AM

  1. మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు ఆరోపణ
  2. దండేపల్లి ఎస్సై, ఆర్‌ఓను విధుల నుంచి తొలగించాలని డిమాండ్

మంచిర్యాల, డిసెంబర్ 4 (విజయక్రాంతి): దండేపల్లి మండలంలో కొంత మంది అధికారులు ఎన్నికల్ కోడ్ ను ఉల్లంఘించి విత్ డ్రా సమయం ముగిసిన తర్వాత అభ్యర్థి నామినేషన్ విత్ డ్రా చేయడానికి సహకరించారని మంచిర్యాల మాజీ ఎంఎల్‌ఏ నడిపల్లి దివాకర్ రావు ఆరోపించారు. గురు వారం తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు.

దండేపల్లి మండలం పాత మామిడిపల్లి గ్రామ సర్పంచ్ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాధవిని, కాంగ్రెస్ పార్టీ నాయకుల అండదండలతో, ప్రోత్సాహంతో దండేపల్లి మండల ఎస్.ఐ ఎన్నికల ఉపసంహరణ సమయం ముగిసిన తర్వాత ఎన్నికల కార్యాలయంలోకి వెనుక డోర్ నుంచి తీసుకువచ్చి మాధవి నామినేషన్‌ని విత్ డ్రా చేపించే ప్రయత్నం చేశారన్నారు.

ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కు సైతం ఫోన్ చేసి తెలపగా అభ్యర్థి మూడు గంటలలోపే విత్ డ్రాకి వచ్చారని, వెరిఫికేషన్ కోసం మళ్లీ పిలిచారని సమాధానం ఇచ్చారన్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయని తెలుపగా ఆ నామినేషన్ విత్ డ్రాని ఆమోదించలేదని కలెక్టర్ రాత్రి ఆర్‌ఓ ఆమోదించారని చెప్పారన్నారు. 

అధికార పార్టీకి మద్దతుగా నిలుస్తూ, ఎన్నికల కోడ్ ను, ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కిన దండేపల్లి ఎస్త్స్రని, ఎన్నికల అధికారిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఎన్నికల కమిషన్ కి, అధికారులకు ఫిర్యాదు చేస్తున్నామన్నారు.

ఈ విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, మాజీ ప్రజాప్రతినిధులు అత్తి సరోజ, చుంచు శ్రీనివాస్, గాదె సత్యం, పల్లె భూమేష్, వంగ తిరుపతి, అక్కూరి సుబ్బయ్య, నరేష్, టీబీజీకేఎస్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.