రూ.5 కోట్లతో కందకం రోడ్డు పనులు
ప్రారంభించిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
సదాశివపేట, జనవరి 4 : సదాశివపేట పట్టణంలో కందకం రోడ్డులో సెంట్రల్ లైటింగ్, డివైడర్, రోడ్డు పనులకు 5 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పనులకు టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఆదివారం స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో 2014 సంవత్సరంలో అప్పటి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో రూ.20 కోట్లతో కందకం రోడ్డు పనులను ప్రారంభించి దాదాపు రూ. 15 కోట్ల అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు.
సిడిసి చైర్మన్ గడిల రామ్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లు పట్లూరి నాగరాజ్ గౌడ్,గుండు రవి, లక్ష్మీ ప్రసన్న శంకర్ గౌడ్, రాయిపాడు రమేష్, వాజిద్,మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నం సుభాష్, ఆత్మ కమిటీ డైరెక్టర్ రా ములు గౌడ్,నాయకులు కోడూరి శరత్, మా మిడి రాజు, బిట్ల ప్రేమ్,షెజ్జీ, సాబేర్, వసీం దాదా, లడ్డు, లాజర్, మనీ, నితి, నరేష్, విజయ్, భరత్, దిలీప్, తాహెర్, యూనుస్, ఆర్ అండ్ బి అధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో
రక్తదాన శిబిరం..
సంగారెడ్డి, జనవరి 4 : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి సారథ్యంలో ఫసల్ వాదిలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో స్వచ్ఛంద రక్త దాన శిబిరం, ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. హెల్త్ క్యాంప్‌లో భాగంగా పంటి పరీక్షలు, కంటి పరీక్షలు, ఈసిజి వంటి పరీక్షలు నిర్వహించారు. టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, మహేశ్వర శర్మ సిద్ధాంతి ప్రారంభించారు. రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు, ప్రముఖ వైద్యుడు డాక్టర్ శ్రీధర్, సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, విద్యాపీఠం సేవకులు పాల్గొన్నారు.






