calender_icon.png 7 January, 2026 | 12:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోయిన్‌పల్లిలో అర్వింద్ కుమార్ ద్వివేది జన్మదిన వేడుకలు

05-01-2026 12:28:47 AM

సికింద్రాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): కంటోన్మెంట్ బోర్డు సీఈవో అరవింద్ కుమార్ ద్వివేది పుట్టిన రోజు వేడుకలు ఆదివారం కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు జంపన ప్రతాప్ ఆధ్వర్యంలో బోయిన్ పల్లి ప్లే గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోర్డ్ సీఈవో అరవింద్ కుమార్ ద్వివేది హాజరై కేక్ కట్ చేసి అరవింద్ కుమార్ ద్వివేది జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ఆయనకు శాలువా కప్పి,బొకే అందించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి మధుకర్,ముఖేష్ యాదవ్, వరప్రసాద్, బిల్డర్ మాల్యాద్రి, మహిళ నాయకురాలు, స్థానిక నాయకులు తదితరులు కూడా ద్వివేదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.