calender_icon.png 7 January, 2026 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబాకస్ పరీక్షలో రాష్ట్రస్థాయి పరీక్షకు ఎంపిక

05-01-2026 12:30:21 AM

ఉమ్మడి జిల్లా స్థాయిలో శ్రీవిద్యా స్కూల్ ప్రభంజనం, ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులు

పాపన్నపేట, జనవరి 4 : ఉమ్మడి జిల్లా స్థాయి అబాకస్ పరీక్ష లో పాపన్నపేట శ్రీ విద్య పాఠశాల విద్యార్థులు ఉత్తమ నైపుణ్యం ప్రదర్శించి 5 క్యాటగిరిలలో జిల్లా స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ లు సాధించారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో విశ్వం ఎడ్యూటెక్ ఆధ్వర్యంలో జీనియస్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ లో ఆదివారం ఉమ్మడి జిల్లా స్థాయి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో ఉమ్మడి జిల్లా నుంచి 42 స్కూల్స్ కు చెందిన 884 విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ పోటీ పరీక్షలో శ్రీ విద్య పాఠశాల పాపన్నపేటకు చెందిన హార్దిక్ రామ్ స్టార్ జూనియర్ స్థాయి పరీక్షలో మొదటి ర్యాంకు సాధించగా, హేమాన్ సెకండ్ ర్యాంక్ సాధించారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో  అబాకస్ పరీక్షల్లో శ్రీ విద్యా స్కూల్ విద్యార్థులు మంచి నైపుణ్యం ప్రదర్శించి ఐదు కేటగిరిల్లో ర్యాంక్ లు సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు వెల్లడించారు. అబాకస్ లో మంచి ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ రవీందర్, కరస్పాండెంట్ నీఠలాక్షప్ప, సుమన్, ఉపాధ్యాయురాలు ప్రియాంక, దుర్గ, అనురాధ, స్రవంతి, వనజ, పల్లవిలు అభినందించారు.