calender_icon.png 24 October, 2025 | 2:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదర్శంగా ముందుకు సాగుదాం

24-10-2025 11:00:19 AM

డివిజన్ అధ్యక్షులు పాండు

కౌకుంట్ల : అందరం ఐక్యంగా ఉంటూ ఆదర్శంగా ముందుకు సాగుదామని డివిజన్ అధ్యక్షుడు పాండు అన్నారు. గురువారం 1104 యూనియన్ దేవరకద్ర సబ్ డివిజన్ ఎలక్షన్స్ కౌకుంట్ల 33/11KV సబ్ స్టేషన్ ఆవరణలో మహబూబ్ నగర్ డివిజన్(Mahabubnagar Division) ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  సబ్ డివిజన్ అధ్యక్షులుగా మునిస్వామి,  వర్కింగ్ ప్రెసిడెంట్ గా ధర్మ ,  సెక్రటరీ గా హరీష్ కుమార్,  సెక్షన్ లీడర్లు గా దేవరకద్ర సెక్షన్ లీడర్ గా జానకి రాములు, చిన్న చింత కుంట సెక్షన్ లీడర్ గా శ్రీకాంత్, కౌకుంట్ల సెక్షన్ లీడర్ గా గౌస్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యత తీసుకోవడం చాలా గొప్ప విషయమని తీసుకున్న బాధ్యతకు సమర్థవంతంగా సేవలు అందించినప్పుడే సరైన గుర్తింపు లభిస్తుంది అన్నారు. ఉద్యోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ప్రతి సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుదామని సూచించారు. నూతనంగా బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. అనంతరం శాలువ పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పాండు, డివిజన్ కార్యదర్శి యాదయ్య గౌడ్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా  జి  శేఖర్, అదనపు కార్యదర్శి  రామరాజు, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ కె. నర్సింలు, జిల్లా సలహాదారులు దేవరకద్ర శ్రీనివాసులు, సబడివిజన్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.