calender_icon.png 24 October, 2025 | 1:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో సమావేశం

24-10-2025 10:57:57 AM

బెజ్జూర్,(విజయ క్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల(Indiramma Housing beneficiaries) లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.ఇట్టి సమావేశంలో ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు త్వరితగతిన పూర్తి చేయాలనీ. ఆర్థికంగా లేని వారికీ మహిళా సంగంలో అర్హులున్న  సభ్యులకు ఐకెపి ద్వారా లోన్స్ ఇప్పించడం జరుగుతుందని అన్నారు.

మండలంలో ఎవరైతే ఇండ్లు నిర్మాణం మొదలు పెట్టలేదో వారు తొందరగా మొదలు పెట్టాలని అన్నారు. బిల్లులు పడని వాటి గురించి మాట్లాడుతు మండలం టెక్నికల్ ప్రాబ్లెమ్ తో డబ్బులు ఇంకా పడలేదు రెండు రోజుల్లో లబ్ధిదారుల ఖాతాలకు వస్తాయి అని లబ్ధిదారులకు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో లబ్ధిదారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, హౌసింగ్ ఏ ఈ  సోహెల్, ఏపీవో రాజన్న, ఏ పి ఎం  మోహనదాస్, గ్రామ కార్యదర్శి వైకుంఠం, ఐకెపి సీసీ తదితరులు పాల్గొన్నారు.