దివ్య నగర్ అభివృద్ధి కమిటీ ఎన్నిక
నిర్మల్, జులై 23 ( విజయ క్రాంతి): నిర్మల్ పట్టణం లోని దివ్య నగర్ కాలనీ అభివృద్ధి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.గౌరవ అధ్యక్షులుగా కోరిపల్లి రామ్ కిషన్ రెడ్డి,అధ్యక్షులుగా పురస్తు శంకర్, ఉపాధ్యక్షులుగా జి. శ్రీనివాసచారి,కృష్ణారెడ్డి, జనరల్ సెక్రెటరీగా సరసాని మహేందర్ రెడ్డి, కోశాధికారిగా ఇర్రి నరేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి గా జి. రాకేష్ రెడ్డి,జి. అంబాజీ, కార్యవర్గ సభ్యులుగా జుట్టు లక్ష్మణ్, పత్తిరెడ్డి సుదర్శన్ రెడ్డి, అంగ రవి, ధర్మగడ్డ కృష్ణ కుమార్, రాచమల్ల రాజన్న, సుధార్ సింగ్, సలహాదారులుగా రాథోడ్ రాందాస్, కొండ్రు సురేష్, ముసుకు సతీష్ రెడ్డి, ఏలేటి విజయభాస్కర్ రెడ్డి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్ష,కార్యదర్శులు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. కాలనీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని వారు తెలిపారు.






