23 July, 2026 | 4:02 PM

ప్రతి ఓటు కీలకం – సర్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి: ఉప్పల్ ఎమ్మెల్యే

23-07-2026 03:30 PM

ఉప్పల్ జూలై 23విజయక్రాంతి : ఉప్పల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న సర్ (స్పెషల్ ఇంటెన్షవ్ రెవిషన్ ) కార్యక్రమం ఆశించిన స్థాయిలో పురోగమించడం లేదని, అర్హులైన ప్రతి ఓటరు పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రత్యేకంగా కృషి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సూచించారు.మీర్‌పేట్ హౌసింగ్ బోర్డు డివిజన్ పరిధిలోని తిరుమల నగర్‌లో ఏర్పాటు చేసిన సర్ నమోదు కేంద్రాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు అత్యంత విలువైనదని, ఒక్క అర్హత కలిగిన ఓటరు కూడా జాబితాకు దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.ఓటరు జాబితాలో పేరు లేకపోయినా, వ్యక్తిగత వివరాల్లో తప్పులు ఉన్నా వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించి సవరణలు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పార్టీ నాయకులు, బూత్ స్థాయి ఇన్‌ఛార్జీలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ఇంటింటికీ వెళ్లి సర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ప్రభుదాస్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.