23 July, 2026 | 3:54 PM

కలెక్టరేట్‌లో నూతన జనరేటర్ ప్రారంభం

23-07-2026 03:22 PM

నిర్మల్ జులై 23 ( విజయక్రాంతి): జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన జనరేటర్‌ను జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) రాథోడ్ రమేష్ గురువారం ప్రారంభించారు. స్విచ్ ఆన్ చేసి జనరేటర్‌ను వినియోగంలోకి తీసుకువచ్చారు మాట్లాడుతూ, విద్యుత్ అంతరాయాల సమయంలో కూడా కలెక్టరేట్‌లోని కార్యాలయాల పనులు నిరంతరాయంగా కొనసాగేందుకు ఈ నూతన జనరేటర్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజలకు సేవలందించే ప్రభుత్వ కార్యాలయాల పనితీరులో ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో ప్రవీణ్, సిబ్బంది పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.