20 March, 2026 | 9:45 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

'భైరవం' నుంచి పూర్ణిమగా దివ్యా పిళ్లై ఫస్ట్ లుక్ రిలీజ్

15-11-2024 07:43 PM

లీడ్ యాక్టర్స్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లను రిలీజ్ చేసిన తర్వాత 'భైరవం' మేకర్స్ ఇప్పుడు ఫీమేల్ లీడ్ పాత్రలపై దృష్టి పెట్టారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పిస్తున్నారు. భైరవం ఇప్పటికే  స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేసింది.

ఈ మూవీలో దివ్యా పిళ్లై ఒక హీరోయిన్ గా నటిస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా ఆమెను బంగారు బొమ్మ "పూర్ణిమ"గా పరిచయం చేశారు. పోస్టర్ లో దివ్యా పిళ్లై ట్రేడిషనల్ శారీలో బ్యూటీఫుల్ గా కనిపించారు. ఫస్ట్ లుక్ లో నిజంగానే బంగారు బొమ్మలా ఆకట్టుకున్నారు. ఛార్మింగ్ స్మైల్ లో ఆమె ప్రజెన్స్ అందరినీ అలరించింది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ హరి కె వేదాంతం, సంగీతం శ్రీ చరణ్ పాకాల. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్. సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాస్తున్నారు.