9 July, 2026 | 2:14 AM

జొకోవిచ్‌కు షాక్

13-05-2024 12:30 AM

రోమ్: ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్‌కు షాక్ తగిలింది. ఇటాలియన్ ఓపెన్‌లో ఈ సెర్బియా స్టార్ మూడో రౌండ్‌లోనే వెనుదిరిగాడు. ఆదివా రం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో జొకోవిచ్ 2 3 కెనడాకు చెందిన అలెజాండ్రో తబిలో చేతిలో వరుస సెట్లలో ఓటమి పాలయ్యాడు. ఇక ఫ్రెంచ్ ఓపెన్‌కు సన్నాహక టోర్నీగా భావిస్తున్న ఇటాలియన్ ఓపెన్ లో జొకోవిచ్ ఫెవరెట్‌గా బరిలోకి దిగాడు. అయితే ఈ సెర్బియా స్టార్ మూడో రౌండ్‌కే పరిమితం కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఇక స్పెయిన్ బుల్ రఫేల్ నాదల్ రెండో రౌండ్‌లోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. మహిళల విభాగంలో రెండో సీడ్ అరీనా సబలెంకా ప్రిక్వార్టర్స్‌కు చేరుకుంది.