2 July, 2026 | 12:08 PM

Breaking News

తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •   ఆటో బోల్తాపడి 10 మందికి తీవ్రగాయాలు   •  

నిమజ్జనంలో 4 డీజేలు సీజ్

05-09-2025 10:18 PM

ఇచ్చోడ,(విజయక్రాంతి): సుప్రీంకోర్టు నియమ నిబంధనకు లోబడి సౌండ్ బాక్స్లను ఏర్పాటు చేయాలని అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం... చర్యలు తప్పవని ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలిపారు. గురువారం నేరడిగొండ మండలం వడూరు గ్రామంలో గణపతి మండపాల వద్ద నిబంధనలకు అధిక్రమించి ఏర్పాటు చేసిన 4 డీజే లను స్వాధీనం చేసుకొని డీజే యజమానులపై, ఆపరేటర్లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగేలా అధిక శబ్దం వచ్చే విధంగా డీజే లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గణపతి మండపాల వద్ద ఎలాంటి డీజేలకు అనుమతి లేదని అతిక్రమించిన వారి పై చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నేరేడిగొండ ఎస్సై ఇమ్రాన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.