05-09-2025 10:22:03 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలోని పోలవరం ప్రాథమిక పాఠశాల ఉత్తమ పాఠశాల అవార్డుకు ఎంపికైంది. శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ అవార్డును జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ట్రైనీ కలెక్టర్ సౌరవ్ శర్మ, అశ్వరావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ,డిఈఓ నాగలక్ష్మి చేతుల మీదుగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమా అందుకున్నారు.పాఠశాలకు అవార్డు రావడం పట్ల మండల అధికారులు, గ్రామస్తులు అభినందించారు.