calender_icon.png 6 September, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుల మతాలకతీతంగా వినాయకుడి పండుగ నిర్వహించడం అభినందనీయం

05-09-2025 10:12:36 PM

చండూరు,(విజయక్రాంతి): కుల మతాలకతీతంగా వినాయకుని పండుగ నిర్వహించడం అభినందనీయమని మర్రిగూడ మాజీ ఎంపీపీ అనంతరాజు గౌడ్ అన్నారు. శుక్రవారం మర్రిగూడ మండల పరిధిలోని శివన్న గూడెం గ్రామంలో శ్రీ వినాయక ఉద్యోగ కమిటీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరా నగర్ కాలనీలో నిర్వహించిన అన్న ప్రసాద కార్యక్రమంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వినాయకుడి పండుగ చిన్నారులకు, యువతకు, పెద్దలకు, భక్తులకు, ఎంతో ఆనందాన్ని ఉల్లాసాని కలిగించడమే కాకుండా ధైర్యాన్ని, భక్తి మార్గాన్ని చూపిస్తుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం అన్నదాతగా నిలిచిన అనంతరాజు గౌడ్ ను గ్రామస్తులు అభినందించడంతోపాటు శాలువాతో సన్మానించారు..కార్యక్రమంలో శివన్నగూడెం మాజీ సర్పంచ్ సబితా యాదగిరి రెడ్డి, సిద్ధగోని వెంకటేష్ గౌడ్, ఆంధ్రప్రభ రిపోర్టర్ కొంపెల్లి నాగరాజు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొని అన్నదానాన్ని విజయవంతం చేశారు.