19 June, 2026 | 3:30 AM

టీ-హబ్ సెంటర్ తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో

19-06-2026 01:48 AM
  1. టెస్టుల నిర్వహణ, రికార్డుల పరిశీలన
  2. పలు హెల్త్ సెంటర్ల ఆకస్మిక తనిఖీ 

సంగారెడ్డి, జూన్ 18 (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ లలితాదేవి జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్‌ను తనిఖీ చేశారు. గురువారం ‘విజయక్రాం తి దినపత్రికలో పడకేసిన తెలంగాణ డయాగ్నస్టిక్స్’ అనే శీర్షికన ప్రచురించిన కథనానికి ఆమె స్పందించారు. దీంతో టీ-హబ్ సెంటర్ ను తనిఖీ చేసి అన్ని విభాగాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవల నాణ్యత, వైద్య సదుపాయాలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు.

రక్తనమూనాల రిపోర్టుల అందజేత, టీ-హబ్‌లో నిర్వహించే అన్ని రకాల పరీక్షలు సక్రమంగా నిర్వహిస్తున్నారా? లేదా? అంటూ ఆరా తీశారు. రోగు లకు మరింత మెరుగైన సేవలు అందించేందు కు అవసరమైన చర్యలు తీసుకోవాలని సం బంధిత అధికారులకు సూచించారు.

ఆరోగ్య సంస్థలలో పరిశుభ్రత, రోగులకు స్నేహపూర్వక సేవలు, రికార్డుల సక్రమ నిర్వహణతో పాటు అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాల సమర్థవంతమైన అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతి సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమా లను విజయవంతం చేయడంలో సమన్వయంతో ముందుకు వెళ్ళాలని డీఎంహె చ్‌వో సూచించారు. 

హెల్త్ సెంటర్ల తనిఖీ..

జిల్లాలో పలు హెల్త్ సెంటర్లను డీఎంహెచ్వో లలితాదేవి తనిఖీ చేశారు. కొండాపూర్ పీహెచ్‌సీ, సదాశివపేట అర్బన్ ఫ్యామిటీ వెల్ఫేర్ సెంటర్, బస్తీ దవాఖాన, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం సదాశివపేటలోని వైద్య సంస్థలలో వైద్యాధికారులు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, సూపర్‌వైజర్లు, ఇతర సిబ్బందితో సమావేశమై అసంక్రమణ వ్యాధుల గుర్తింపు, స్క్రీనింగ్ చికిత్సలు పెంచాలని ఆదేశించారు. అలాగే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమం పురోగతిని సమీక్షించి, అర్హులైన బాలికలకు వంద శాతం కవరేజ్ సాధించేలా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.