11 July, 2026 | 9:34 PM

మారికో నికరలాభం రూ.320 కోట్లు

07-05-2024 01:32 AM

న్యూఢిల్లీ, మే 6: ఎఫ్‌ఎంసీజీ కంపెనీ మారికో కన్సాలిడేటెడ్ నికరలాభం 2024 మార్చి త్రైమాసికంలో 5 శాతం వృద్ధితో రూ.320 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ.305 కోట్ల కన్సాలిడెట్ నికరలాభాన్ని సంపాదించింది. మార్చి క్వార్టర్లో స్వీక్వెన్షియల్‌గా చూస్తే 17 శాతం లాభం తగ్గింది. క్యూ3లో ఇది రూ.386 కోట్లుగా నమోదయ్యింది. క్యూ4లో కంపెనీ ఆదాయం 1.7 శాతం పెరిగి రూ. 2,240 కోట్ల నుంచి రూ.2,278 కోట్ల కు పెరిగింది. స్టాండెలోన్ ప్రాతిపదికన క్యూ4లో మారికో రూ. 1,637 కోట్ల ఆదాయంపై రూ. 229 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.