డీఎంకే ఎమ్మెల్యే రాధాకృష్ణన్ అరెస్ట్
తమిళనాడు సీఎం విజయ్‌పై అభ్యంతర వ్యాఖ్యలే కారణం
చెన్నై, జులై 3: ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై దాఖలైన పరువు నష్టం కేసు లో ముందస్తు బెయిల్‌ను నిరాకరించడం తో, తూత్తుకుడి పోలీసులు శుక్రవారం ఆ థూర్‌లో మాజీ మంత్రి, డీఎంకే దక్షిణ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్యే అనితా ఆర్ రాధాకృష్ణన్‌ను అరెస్టు చేశారు.
సిట్టింగ్ తిరుచెందూర్ ఎమ్మెల్యే రాధాకృష్ణన్‌ను విచారణ నిమిత్తం తూత్తుకుడి ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లా రు. జూన్ 20న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి జయంతి సంద ర్భంగా ఆత్తూర్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ముఖ్యమంత్రి విజయ్‌పై పరువు న ష్టం కలిగించే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
చిత్ర పరిశ్రమ నుంచి ఆయన రాజకీయ అరంగేట్రాన్ని ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడటంతోపాటు ఓ నటి ప్రస్తావన కూడ తీసుకొచ్చారు. ఈ ఆరోపణలపై రాధాకృష్ణన్‌ను జూన్ 23న ఆత్తూర్ పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలపై ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీవీకే ఆథ ర్ అర్బన్ సెక్రటరీ ఎస్. సెల్వం ఫిర్యాదు చే శారు. కాగా ఎమ్మెల్యే అరెస్ట్‌ను డీఎంకే ఎంపీ కనిమెళి ఖండించారు. ప్రతిపక్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడుతోందన్నారు.






