ఆటోలకు ఫిట్‌నెస్ వద్దా?
- ఇష్టారీతిగా విద్యార్థుల తరలింపు
పరిమితికి మించి ఎక్కిస్తున్న వైనం
చూసీ చూడనట్టు అధికారుల వ్యవహారం
వనపర్తి, జూన్ 12 (విజయక్రాంతి): విద్యార్థుల ప్రాణాలతో ఆటోడ్రైవర్లు చెలగా టం ఆడుతున్నారు. నిబంధనలను తోసిరాజని పరిమితికి మించి ఆటోల్లో తరలిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. కళ్లముందే అంతా జరుగుతున్నా తమకేమీ కని పించట్లేదన్నట్టు రవాణాశాఖ అధికారులు వ్యవహరిస్తుండటం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేయడం.. ఆపై పట్టిం పు లేనట్టు వ్యవహరించడం షరా మామూ లే అన్నట్టు తయారైంది. పాఠశాలలకు విద్యార్థులను తరలించే ఆటోడ్రైవర్లు అధిక సంఖ్యలో పిల్లలను ఎక్కించటంతోపాటు రెండు వైపులా పుస్తకాల బ్యాగులు తగిలిస్తూ ప్రమాదకర ఫీట్లు చేస్తున్నారు. ఒక్కో ఆటో లో 15 నుంచి 20 మంది పిల్లలకుపైగా తరలించడంపై ఆందోళన వ్యక్తమ వుతుంది.
బడికి పంపాలంటే ఆటోనే దిక్కు
ప్రస్తుతం కాలంలో భార్యాభర్తలిద్దరూ పనిచేసినా కుటుంబం గడవని పరిస్థితులు ఉన్నాయి. దీంతో పిల్లలను పాఠశాల బస్సులో పంపడం అంటే తలకుమించిన భారమే. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఆసరాగా తీసుకుంటున్న ఆటోడ్రైవర్లు ఆటోల్లో పరిమితికి మించి పిల్లలను ఎక్కించుకుంటున్నారు.
బస్సుకో రూల్.. ఆటోకో రూల్!
పాఠశాల బస్సులకు నియమనిబంధన లు పెట్టిన రవాణాశాఖ అధికారులు.. ఆటో ల విషయంలో పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆటోలో ఆరుగురిని మాత్రమే తీసుకెళ్లాలి అని నింబంధన లు ఉన్నప్పటికీ ఆర్టీఏ అధికారులు ఏమా త్రం పట్టించుకోవడం లేదు. విద్యార్థులను తీసుకువెళ్తున్న ఆటోలు ఏమేరకు ఫిట్‌నెస్ ఉంది? రక్షణ చర్య లు ఏమిటన్న అంశాలను గాలికొదిలేశారు. కాలం చెల్లిన ఆటోలను రూ.10 వేల నుంచి రూ.30వేల వరకు చెల్లించి కొనుగోలు చేసి వాటిని కేవలం పాఠశాలల ఆటోలుగా తిప్పుతున్నారు. వీటి నుంచి వెలువడే కాలుష్యంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.






