సినారె సేవలు అజరామరం
13-06-2024 02:58 AM
ప్రభుత విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల జూన్ 12 (విజయక్రాంతి): జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సీ నారాయణరెడ్డి సేవలు అజరామరమని ప్రభుత విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సినారె వర్ధంతి సందర్భంగా ఆయన సగ్రామంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. సినారె స్మృతి స్థలిపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలు గు సాహిత్య రంగానికి సినారె చేసిన సేవలు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు. కార్యక్రమంలో సినారె కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






